MDK: జోగిపేట ఏరియా ఆసుపత్రిలోని వైద్యులు బుధవారం అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. మూడు రోజుల క్రితం కామారెడ్డికి చెందిన కుమ్మరి రాజు బైక్ నడుపుతూ అన్నాసాగర్ వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి ఎడమ మోకాలి వద్ద ఎముక విరిగింది. ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆనంద్ నాయక్ విరిగిన ఎముకను అతికించే శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశామని తెలిపారు.