NLG: టెన్త్ విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం డీఈవో కార్యాలయంలో ఇవాళ ప్రత్యేక ‘ఫోన్ ఇన్’ కార్యక్రమం నిర్వహించారు. ఉ. 10:30 నుండి 11:30 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సబ్జెక్టు నిపుణులు అందుబాటులో ఉండి, విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ వారి అనుమానాలను తీర్చారు. ఈ కార్యక్రమం పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపింది.