MLG: మంగపేట మండలంలో అభివృద్ధి పనుల కోసం రూ.1.95 కోట్ల నిధులు మంజూరు అయినట్టు రాష్ట్ర పంచాయతీ రాజ్ డైరెక్టర్ గుమ్మడి సోమయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో CRR నిధులకింద మండలంలో రూ.5 కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టామన్నారు. ఇప్పుడు రెండవ విడతగా రూ.1.95 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి మంత్రి సీతక్క నిధులను మంజురు చేసిందన్నారు.