MHBD: పట్టణంలో నిర్మాణం పూర్తై నెలలు గడిచినా మోడల్ మార్కెట్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై CPI నాయకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కూరగాయల తోపుడు బండిని ముందుంచి, కూరగాయలతో తయారు చేసిన దండలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం గాంధీ పార్కులో తాత్కాలికంగా కొనసాగుతున్న కూరగాయల దుకాణాలను వెంటనే నూతన మోడల్ మార్కెట్‌కు తరలించాలన్నారు.