BDK: భద్రాచలం పర్యటనలో భాగంగా రాష్ట్ర గవర్నర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మార్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటంలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి తుమ్మల తెలిపారు.