JGL: మల్లాపూర్ మండలం మొగిలిపేటలో ఇవాళ ఉదయం 8 గo. నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంటు ఉండదని అసిస్టెంట్ లైన్మెన్ విష్ణు ఒక ప్రకటనలో తెలిపారు. 33/11KV లైన్ పనులు, సబ్స్టేషన్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన కరెంటులో కూడా అంతరాయం ఉంటుందన్నారు. రైతులు, విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.