హైదరాబాద్లో వందల ఎకరాల ఆలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి. కొందరు నకిలీ పత్రాలు సృష్టించి వీటిని కబ్జా చేశారు. కబ్జాదారులను ఖాళీ చేయించేందుకు ఎండోమెంట్ ట్రైబ్యునల్, కోర్టుల నుంచి ఎవిక్షన్ ఆర్డర్లు వచ్చినా, రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతర కారణాల వల్ల చర్యలు తీసుకోవడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 1,736 ఆలయాలు ఉన్నాయి.