MBNR: కాంగ్రెస్ పార్టీలో అనిశ్చిత పరిస్థితుల వల్ల కొంతమంది నాయకులు వివిధ పార్టీల నుండి BRSలో చేరుతున్నారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.