NZB: గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,55,961 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. 1,88,611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు శుక్రవారం ఉదయం తెలిపారు. ఇందులో 24 స్పిల్ వే గేట్ల ద్వారా 1,79,171 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.69.855 TMC నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.