SRD: వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ, పటాన్చెరు డివిజన్లోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.