SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం విస్తరణ, అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కలెక్టర్ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు కలెక్టర్కు ఆశీర్వచనం చేశారు.