BHPL: గణపురం మండలంలోని కోటగుళ్లు కార్తీక శోభ సంతరించుకుంది. కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కార్తీకమాసం పురస్కరించుకొని నెల రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం రోజు కార్తీకపౌర్ణమి సందర్భంగా దాతల సహకారంతో 21 వేల దీపాలు వెలిగించి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 21 వేల దీపాలతో కోటగుళ్లు కార్తీక శోభ సంతరించుకుని అందరికీ కనువిందు చేస్తోంది.