NGKL: వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలో మార్క్పైడ్ సౌజన్యంతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజిత, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.