MNCL: లక్షెట్టిపేట శాసనసభ నియోజకవర్గం పునరుద్ధరణపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, శాసనసభ స్థానాల పెంపునకు అంగీకరించిందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పాత నియోజకవర్గ నాయకుల్లో ఆశలు చిగురించాయి. 1972-2009 వరకు లక్షెట్టిపేట శాసనసభ నియోజకవర్గంగా ఉండేది. పునర్ వ్యవస్థీకరణలో లక్షెట్టిపేట శాసనసభ రద్దయి మంచిర్యాల కొత్తగా ఏర్పడింది.