ఆదిలాబాద్ బస్టాండ్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న తల్లి తన 2 నెలల శిశువును వదిలేసిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. పాపను గమనించిన 1 టౌన్ కానిస్టేబుల్ రాజేశ్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్లు శ్రీకాంత్, రామకృష్ణ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని శిశువును రక్షించి శిశు గృహాంలో అప్పగించారు.