NRML: రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. బుధవారం ఖానాపూర్ నియోజకవర్గంలో రైతు పై ఏఎస్ఐ దురుసుగా ప్రవర్తించిన వీడియో వైరల్ కాగా కలెక్టర్ స్పందించారు. దురుసుగా ప్రవర్తించిన ఏఎస్ఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అధికారులు రైతులకు సహకరించాలని రైతు సమస్యలు ఓపికగా వినాలని వారు సూచించారు.