చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పలువురు నెటిజన్లు ‘అరెస్ట్ కోహ్లీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ‘X’లో ట్రెండ్ చేస్తున్నారు. తొక్కిసలాటలో 11 మంది మరణిస్తే, కోహ్లీ తన కుటుంబంతో లండన్‌కు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కప్ మీద ఉన్న ప్రేమ ఫ్యాన్స్ పట్ల లేదని మండిపడుతున్నారు. మరోవైపు, ‘వి స్టాండ్ విత్ కోహ్లీ’ అంటూ పలువురు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.