కోనసీమ: మండల కేంద్రమైన ఆలమూరులోని కొత్తూరు సెంటర్ నందు ఈ నెల 8, 9,10 తేదీల్లో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉచిత వైద్య శిబిరంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు దంత సమస్యలపై పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తారని తెలిపారు. పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.