BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి గురువారం నిత్య ఖజానాకు రూ.17,11,730 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.4,45,740, కార్ పార్కింగ్ రూ.2,20,500, VIP దర్శనాలతో రూ.1,35,000, బ్రేక్ దర్శనాలతో రూ.98,100, ప్రధాన బుకింగ్ రూ.97,750, వ్రతాలతో రూ.92,000, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.