ADB: మాదిగ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అణిచివేస్తుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లాధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో సంఘం నాయకులతో సమావేశమై మాట్లాడారు. మాదిగలను చట్టసభలకు వెళ్లకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.