MHBD: జాతీయ ST కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తండ్రి జాటోతు లచ్చనాయక్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన చిత్రపటానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సాంభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.