SRPT: నూతనకల్ మండల కేంద్రానికి చెందిన బోయిల్లు చంద్రశేఖర్ ఆత్మకూరు(ఎస్) మండల నమస్తే తెలంగాణ జర్నలిస్టుగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో జర్నలిస్టులు ఆ కుటుంబానికి ఆదివారం అండగా నిలిచారు. ఈ మేరకు 15 ఏళ్లుగా తమతో పాటు జర్నలిస్టుగా పనిచేసిన చంద్రశేఖర్ కుటుంబానికి రూ.1.08 లక్షల ఆర్థిక సాయం అందించి కుటుంబానికి ఎల్లవేళలా సహకారం అందిస్తామన్నారు.