WGL: భారీ వర్షాలకు చెన్నారావుపేట మండలం పాపయ్య పేట నుంచి నర్సంపేటకు వెళ్లే రహదారిలో ఉన్న బ్రిడ్జి కుంగింది. ఈ మేరకు శుక్రవారం ఆర్అండ్బీ అధికారులు కుంగిన బ్రిడ్జిని పరిశీలించారు. ప్రమాదంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి భారీ వాహనాలు వెళ్లొద్దని హెచ్చరించారు. పాపయ్యపేట నుంచి నర్సంపేటకు వెళ్లేవారు ఎల్లయ్య గూడెం జల్లి మీదుగా వెళ్లాలని కోరారు.