BDK: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలలో ఐదో విడత తక్షణ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ బడుగు ప్రభాకర్ మంగళవారం తెలిపారు. ఐటీఐ కళాశాలలో డ్రాఫ్ట్ మెన్, సివిల్, డిజిల్ మెకానిక్, తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని, గతంలో సీట్ రానివారు, మళ్లీ ఈనెల 28 లోపు దరఖాస్తు చేసుకొని అడ్మిషన్ పొందాలని కోరారు.