SRD: జిల్లాలోని ప్రభుత్వం మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో 98.66% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఫలితాల్లో 145 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధా మాధురి తెలిపారు. ఇందులో నలుగురు డిస్టింక్షన్లో సాధించగా, 108 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు చెప్పారు.