RS Praveen Kumar: ఇక్కడ రిగ్గింగ్ జరిగింది..విచారణ జరపి రీపోలింగ్ నిర్వహించాలి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ‘ఓటు రిగ్గింగ్’కు పాల్పడ్డారని బిఎస్పి అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఇక్కడ మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అనుచరులు యధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar )ఆరోపించారు. స్థానిక బీఆర్ఎస్ నేతలు బీఎస్పీ పోలింగ్ ఏజెంట్లను భయబ్రాంతులకు గురిచేసి, పోలీసుల అండతో పోలింగ్ బూత్ నెంలు.55,56,75,90 లను తమ ఆధీనంలోకి తీసుకున్నారని తెలిపారు. ఆ క్రమంలో ఈవీఎంలలో ఓట్లు వేస్తు యధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడ్డారని తెలిపారు. అధికారం అండతో బీఆర్ఎస్ పార్టీ నేతలు యేధేచ్ఛగా రిగ్గింగ్ కు పాల్పడినందున రీపోలింగ్ నిర్వహించాలని బీఎస్పీ, బీజేపి నేతలు పోలింగ్ బూత్ ముందు భారీ ఎత్తున నిన్న ధర్నాకు దిగారు.
ఆ క్రమంలో ఉద్రిక్తపరిస్థితి తలెత్తగా BRS క్యాడర్ పార్టీ కార్యకర్తలపై రాళ్లు, చప్పుళ్లతో కొట్టడం ఘర్షణకు దారితీసింది. ఆ నేపథ్యంలో ఇరువైపులా రాళ్ల దాడి జరగడంతో పోలీసులు, కార్యకర్తలు గాయపడ్డారు. హింసను అరికట్టేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగి వారిని అదుపు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది. ఈ నియోజకవర్గం నుంచి బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కన్నప్పతో పాటు కాంగ్రెస్ అభ్యర్థిగా రావి రమేష్, బీజేపీ నుంచి పాల్వాయి హరీష్‌బాబు పోటీ చేస్తున్నారు.