సీఎం కేసీఆర్ ను కొడంగల్ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే ఆహ్వానించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఒక వేళ కేసీఆర్ కొడంగల్లో పోటీకి రాకపోతే తానే కామారెడ్డి నుంచి పోటీ చేసి చిత్తుగా ఓడిస్తామని రేవంత్ అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారం గురించి ఈసీకి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. దీంతోపాటు అధికార పార్టీ నిబంధనలకు విరుద్ధంగా నియమించిన రిటైర్డ్ అధికారులను కూడా తొలగించాలని కోరినట్లు చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో 'పాలమూరు ప్రజాభేరి' పేరుతో అక్టోబర్ 31న నిర్వహించనున్న బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ రానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కీలక నేతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
నిన్నటి వరకు బీజేపీనే బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీలోని కీలక నేతలు తాజా పరిణామంపై స్పందించారు.
తనకు నచ్చకున్న.. సీఎం కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ చర్యలు తీసుకుంటుందని భావించానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. అందుకే బీజేపీలో చేరానని.. కానీ తాను అనుకున్న లక్ష్యం నెరవేరలేదని స్పష్టంచేశారు.
తెలంగాణలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె.. కే కవిత బీజేపీపై విరుచుకుపడ్డారు.