ఖమ్మం జిల్లాలో పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు చేసింది సున్నా అని సీఎం కేసీఆర్ విమర్శలు చేయగా ఆయన స్పందించారు. డిపాజిట్ రాని పార్టీని బలోపేతం చేసింది తాను కాదా అని నిలదీశారు.
తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసి రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలు.. వివిధ అంశాల ఆధారంగా 45 మందికి టికెట్ల కేటాయించింది.
బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తిరిగి పార్టీలో చేరాలని.. ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీని కలువాలని కోరారని విశ్వసనీయంగా తెలిసింది.
పది సంవత్సరాల అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఎమ్మెల్యే రఘునందనరావు అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మాట తప్పని పార్టీ అని, పేదల బతుకులు మారాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.