బీజేపీని వ్యతిరేకించే డీఎన్ఏ తనలో ఉందని రాహుల్ గాంధీ అన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఎందులో ఉంది.. ఏబీబీపీ, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్.. లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ఇండియా టుడే సర్వే రిపోర్ట్ సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుందని.. గతంలో 11 శాతం ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు 39 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తనపై 24 కేసులు పెట్టిందని.. అదే తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు లేదని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ విమర్శించారు . ఆ పార్టీలో పీసీసీ పోస్ట్ కోసం రూ.50 కోట్లు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ఎంపీ ఒకరు అన్నారని తెలిపారు.
ఓబీసీ కుల గణన ఎందుకు చేయడం లేదని కేంద్రాన్ని, రాష్ట్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌కు వారి ఓట్లు కావాలే తప్ప.. ప్రయోజనాలు అక్కర్లేదని హాట్ కామెంట్స్ చేశారు.
తెలంగాణలో కీలక కాంగ్రెస్ నేత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బైక్ ర్యాలీలో భాగంగా ఆమె పాల్గొన్న క్రమంలో స్కూటీ నుంచి కిందపడగా ఆమెకు గాయలయ్యాయి. దీంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
నిన్నటి వరకు పారదర్శకంగా పనిచేస్తుందన్న టీఎస్‌పీఎస్సీ బోర్డును నేడు కేటీఆర్ ప్రక్షాళన చేస్తామని అంటున్నారు. ఇది కాదా దిగుజారుడు రాజకీయాలు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆగ్రహజ్వాలల్లోనే మీ ప్రభుత్వం మంట కలిసిపోతుందని, నిరుద్యోగ ద్రోహులుగా మీరు మిగిలిపోతారని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.