Rahul Gandhi అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది: కేటీఆర్
రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ విమర్శించారు . ఆ పార్టీలో పీసీసీ పోస్ట్ కోసం రూ.50 కోట్లు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ విషయాన్ని సొంత పార్టీ ఎంపీ ఒకరు అన్నారని తెలిపారు.
KTR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకోంది. నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత బీఆర్ఎస్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గురించి విమర్శలు చేశారు. అవినీతి గురించి మాట్లాడారు. దీనిపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు. ట్వీట్లో కౌంటర్ అటాక్ చేశారు.
అవినీతి గురించి రాహుల్ గాంధీ (Rahul Gandhi) మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని విరుచుకుపడ్డారు. గత 60 ఏళ్లు దేశాన్ని దోచారని ఫైరయ్యారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) గురించి మాట్లాడారు. టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలు ఈడీకి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఓటుకు నోటు కేసులో ఇప్పటికే పట్టుబడ్డారని గుర్తుచేశారు.
While Scamgress scion Rahul Gandhi preaches sermons about corruption;
Telangana Congress leaders complain to ED (Enforcement Directorate) for an investigation into “Note for Seat” Scam of TPCC president who’s already a known fraud caught red handed in “Vote for Note” scam 😂… pic.twitter.com/99q2AImMuZ
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ అన్న మాటలను కేటీఆర్ గుర్తుచేశారు. దేశానికి స్వేచ్ఛ లభించిన తరవాత కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని మహాత్ముడు అన్నారని తెలిపారు. ఇలాంటి నేతలు కాంగ్రెస్ పార్టీ ఉంటారని ఆ రోజే ఊహించి ఉంటారెమోనని అనుమానం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ పోస్ట్‌ను రూ.50 కోట్ల అమ్మారని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా అన్నారని గుర్తుచేశారు. ఒకరు విక్రయిస్తే.. మరొకరు కొనుగోలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని.. ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ అని వివరించారు. అలాంటి రాహుల్.. అవినీతి గురించి మాట్లాడటం వింతగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు.