45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కష్ట పడ్డానని.. అయినా అవహేళనకు గురయ్యానని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మియాపూర్‌లో ఓ కారులో భారీగా బంగారం పట్టుబడింది.
తెలంగాణలో ఎన్నికల ప్రచారాలకు రంగం సిద్ధమైంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇద్దరూ 3 రోజుల పాటు తెలంగాణలో ప్రచారం చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 105 సీట్లు గెలుస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో ఎన్నికల సమర శంఖారావాన్ని కేసీఆర్ పూరించారు.
కాంగ్రెస్ గ్యారంటీలు చూసి సీఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ గ్యారెంటీలను అంశాలను కాపీ కొట్టారని మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని రాగిడి లక్ష్మారెడ్డి విరుచుకుపడ్డారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ కోసం 25 ఏళ్లు కష్టపడి పనిచేసిన తనకు టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని తిరిగి గెలిపిస్తే చేసే పనులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధాన హామీలను ఓ సారి పరిశీలిద్దాం.