కాంగ్రెస్ పార్టీ(Congress party)లో అసంతృప్తుల సెగ మొదలైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ టికెట్‌ను తోటకూర జంగయ్య యాదవ్‌కు కేటాయించడంతో అదే టికెట్ ఆశించిన కాంగ్రెస్ జిల్లా జెడ్పీ ప్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి (Harivardhan Reddy) ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. కీసర కాంగ్రెస్ కార్యాలయంలో హరివర్దన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యచరణను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.ఈ నెల 18 మేడ్చల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ (CMKCR) సమక్షంలో పార్టీలో హరివర్దన్ రెడ్డి చేరనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఉప్పల్‌లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి అధిష్టాన్నికి రాజీనామా లేఖ పంపారు. ఉప్పల్ టికెట్‌ను ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డికి కేటాయించడంతో బీ బ్లాక్ అధ్యక్షుడు సింగిరెడ్డి (Singireddy) సోమశేఖర్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన రాగిడి లక్ష్మారెడ్డి సైతం పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు.30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశానని, పొత్తులో భాగంగా గతంలో తన సీటు పోయినా పని చేశానని చెప్పారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ కనుమరుగవుతుందన్న సమయంలో పార్టీకి జీవం పోసానన తెలిపారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొడంగల్‌లో ఓడిపోతే మల్కాజ్గిరి ఎంపీగా ఆహ్వానించి గెలిపించుకున్నామని చెప్పారు.ఇప్పుడు తమ్మల్ని మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.