Ex Minister Malla Reddy Approached Telangana High Court
Minister Mallareddy: చంద్రబాబు అరెస్ట్ చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కొనసాగుతున్నాయి. బాబును అరెస్ట్ చేసిది ఏపీ సర్కార్.. కానీ తెలంగాణ నేతలు, మంత్రులు కూడా స్పందిస్తున్నారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి మల్లారెడ్డి (Mallareddy) స్పందించారు. అధికార వైసీపీ, బీజేపీలపై ఆరోపణలు చేశారు.
చంద్రబాబు అరెస్ట్ వెనక వైసీపీ ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వైసీపీకి బీజేపీ సపోర్ట్ చేసిందని.. అందుకే అరెస్ట్ జరిగిందని హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ, బీజేపీ లేకుండా అరెస్ట్ జరగదని కామెంట్స్ చేశారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని జైలులో వేస్తారా..? చంద్రబాబు ఏం తప్పు చేశారు అని అడిగారు. తనకు తెలిసి బాబు ఎవరినీ మోసం చేయలేదన్నారు. దేశంలో బెస్ట్ సీఎం అన్నారు. అలాంటి వ్యక్తి జైలులో పెట్టి ఇబ్బందికి గురిచేశారని తెలిపారు.
చంద్రబాబు ఆరోగ్యం కూడా బాగాలేదన్నారు. తనకు చంద్రబాబు అంటే అభిమానం అని మల్లారెడ్డి వివరించారు. లోక్ సభ సీటు ఇచ్చి గెలిపించారని గుర్తుచేశారు. రాజకీయంగా తనకు జీవితం ఇచ్చింది కేసీఆర్ అని పేర్కొన్నారు. జీవితంలో ఎప్పుడూ మర్చిపోనని వివరించారు. చంద్రబాబుకు తన పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.