కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది. జాబితాలో ఉత్తమ్, మైనంపల్లి ఫ్యామిలీకి చెరో రెండు టికెట్లు లభించాయి. జానారెడ్డి కుమారుడు జయవీర్‌కు నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముందు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఏకీపారేశారు. ఆ వీడియోను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ షేర్ చేశారు.
కల్వకుంట్ల కవిత లిక్కర్ బోర్డు తీసుకొచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను మాత్రం పసుపు బోర్డు ఏర్పడేందుకు కృషి చేశానని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచార పర్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 18వ తేదీన ప్రారంభిస్తారు. తన సోదరి ప్రియాంకతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి బస్సు యాత్ర చేపడుతారు.
మేనిఫెస్టో రూపకల్పన గురించి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో చర్చిస్తున్నారు. వరసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యుహాంపై డిస్కష్ చేస్తున్నారు.
అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం ఫోకస్ చేసింది. ఎక్కువ ఖర్చు చేస్తోన్నప్పటికీ.. తక్కువ చూపిస్తున్నారు. అందుకే ఈ సారి ఒక్కో అంశానికి ధరలను ఫిక్స్ చేసింది.
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రత్యర్థుల కామెంట్లకు ప్రధాన పార్టీలు దీటుగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు.