KTR Meets Ponnala Laxmaiah: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇప్పటికీ సీట్లు కూడా మారుతున్నాయి. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు (Ponnala Laxmaiah) కాంగ్రెస్ పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. హైకమాండ్‌ను కలిసి బాధను చెబుతున్న అంతగా రెస్పాండ్ కాలేదు. సో.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఏ పార్టీలో చేరే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. పొన్నాల లక్ష్మయ్యను ఆయన నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. తమ పార్టీలోకి రావాలని సాదరంగా ఆహ్వానించారు.
4 దశాబ్దాలుగా సేవలు
కాంగ్రెస్ పార్టీలో పొన్నాల లక్ష్మయ్య నాలుగు దశాబ్దాలుగా పనిచేశారు. కార్యకర్త నుంచి మంత్రి పదవీ చేపట్టారు. పీసీసీ చీఫ్ పదవీని కూడా చేపట్టారు. ఇటీవల పొన్నాలను కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదు. దానిపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో జరుగుతన్న పరిణామలను వివరించారు. అక్కడ కూడా ఆశించిన రెస్పాన్స్ రాలేదు. లాభం లేదు అనుకుని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలో చేరే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ గమనిస్తున్నారు. పార్టీలో పొన్నాల అసంతృప్తి ఉన్నట్టు తెలసింది. పొన్నాల బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత.. బీఆర్ఎస్ బీసీ నేతలు రంగంలోకి దింపారు. వారు చర్చలు జరిపి.. పార్టీలోకి రావాలని కోరారు. ఆ తర్వాతే కాంగ్రెస్ పార్టీకి పొన్నాల రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.
పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
రేపు కేసీఆర్‌ను కలిసి అక్టోబర్ 16న జనగాంలో జరగబోయే సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న పొన్నాల లక్ష్మయ్య. pic.twitter.com/2KcMnwoBLv
బీసీ నేతలతో చర్చలు
బీసీ నేతలతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ రోజు మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. పొన్నాల ఇంటికి వచ్చి మరీ పార్టీలో చేరాలని ఇన్వైట్ చేశారు. తన ఆహ్వానాన్ని మన్నించారని.. పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారని వివరించారు. రేపు సీఎం కేసీఆర్‌ను పొన్నాల లక్ష్మయ్య కలుస్తారని.. ఆ తర్వాత ఆయన మాట్లాడారని పేర్కొన్నారు. 15వ తేదీ నుంచి సీఎం కేసీఆర్ బహిరంగ సభలతో జనంలోకి వస్తున్నారు. 16వ తేదీన జనగామలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ సభలోనే పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారని కేటీఆర్ వివరించారు. బీసీ నేతలకు తగిన గౌరవం ఇస్తామని.. గతంలో కే కేశవరావు, డీ శ్రీనివాస్‌ను ఏ విధంగా గౌరవించామో.. ఇప్పుడు పొన్నాలకు కూడా అదే గౌరవం దక్కుతుందని, ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.
పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకొని ఆయనని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ pic.twitter.com/KghWKghwZI
ప్రాధాన్యం
అన్నీ సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తామని కేటీఆర్ చెప్పారు. పొన్నాల విజ్ఞాన వేత్త అని.. 1960లో అమెరికాలో చదువుకున్నారని గుర్తుచేశారు. నాసాలో ఇంజినీర్‌గా పనిచేశారని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారని వివరించారు. అలాంటి వ్యక్తిని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును కేటీఆర్ ఖండించారు. ఆయన మాటలను విని పార్టీలకు అతీతంగా అందరూ చీదరించు కున్నారని తెలిపారు. రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చి.. ఇప్పుడు ఏ పార్టీ చీఫ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. దిగజారుడు సంస్కృతి మంచిది కాదని.. నోటికొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదని సూచించారు. అంతేకాదు చచ్చే ముందు పార్టీ మారడం అనడం ఏంటీ అని.. ఎవరు, ఎప్పుడు చస్తారో.. ఎవరికీ తెలుసు, చిల్లరగా మాట్లాడటం సరికాదన్నారు. కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొబెడితే ఇలానే ఉంటుందని ధ్వజమెత్తారు.