Rs.42 Crore Seize: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ప్రలోభాల పర్వం అప్పుడే మొదలయ్యింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ ప్రక్రియ మొదలైంది. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతోన్న నోట్ల కట్టలు మాత్రం యథావిధిగా బయటపడుతున్నాయి.
ఐటీ హబ్ బెంగళూర్లో రైడ్స్ కొనసాగుతోన్నాయి. రెగ్యులర్గా రైడ్ చేస్తుండగా నోట్ల కట్టలు బయట పడుతున్నాయి. ఓ మాజీ మహిళ కార్పొరేటర్, ఆమె భర్తను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారి ప్లాట్లో దొరికిన నోట్ల కట్టలను లెక్కించగా రూ.42 కోట్లు (Rs.42 Crore Seize) ఉన్నాయి. వీరు నగల దుకాణ యజమానులు, ఇతరుల నుంచి సేకరించారని తెలిసింది. తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికలకు నగదు పంపిణీ కోసం డబ్బులు సేకరించారని ప్రాథమికంగా తెలిసింది.
ఆర్టీ నగర్లో గల ఆత్మానంద కాలనీలో ఓ ఫ్లాట్లో తనిఖీలు చేపట్టారు. బెడ్ కింద 23 పెట్టెల్లో దాచిన రూ.500 నోట్ల (500 notes) కట్టలను గుర్తించారు. ఆ మొత్తం లెక్కించగా రూ.42 కట్లు అని తేలింది. ఆ ప్లాట్ ఖాళీగా ఉండటం.. అక్కడ ఎవరూ ఉండటం లేదని తెలిసింది. ఆ ఫ్లాట్ ఎవరదనే అంశంపై క్లారిటీ లేదు. మాజీ కార్పొరేటర్ భర్త కాంట్రాక్టర్ అని సమాచారం.
ఇటు హోస్కోటలో బిర్యానీ సెంటర్లపై దాడులు చేస్తున్నారు. హోటల్ యజమాని ఇంట్లో 30కి పైగా క్యూఆర్ కోడ్ స్కానర్లను గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.1.47 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.