»After Udayanidhi Stalins Sensational Comments On Sanatana Dharma Rss Chief Mohan Bhagwat Spoke About Sanatana Dharma
Sanatana Dharma: సనాతన ధర్మం భారత్‌కు పర్యాయపదం: మోహన్ భగవత్
దేశంలో సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటూ డీఎంకే నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. దీనిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఘాటుగా స్పందించారు.
Sanatana Dharma: సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు భారతదేశం. ఎన్నో ఏళ్లు నుంచి ఉన్న ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం భారత్‌కు పర్యాయపదం. దేశ సంస్కృతి సనాతన ధర్మం మీదే ఆధారపడి ఉంది. అలాంటి ధర్మాన్ని నాశనం చేయాలనుకోవడం స్వీయ హానితో సమానమని అభిప్రాయపడ్డారు.
సనాతనమంటే ఎప్పటికీ నిలిచి ఉండేది. మన ధర్మం కూడా అంతే అని తెలిపారు.హర్యానాలోని రోహతక్‌లో బాబా మస్త్‌నాథ్ మఠంలో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి వీకే సింగ్, యోగా గురు రామ్‌దేవ్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆదిత్య నాథ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం అంతా భారత్ వైపు చూస్తుంది. ఒకప్పుడపు అసాధ్యం అనుకున్న అయోధ్య రామ నిర్మాణం ఇప్పుడు జరుగుతుందని తెలిపారు.