భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ప్రేక్షకులు జై శ్రీరాం నినాదం చేయడంపై ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది సరైన పద్దతి కాదని స్టాలిన్ ట్వీట్ చేయడంతో బీజేపీ చీఫ్ అన్నమలై ఘాటుగా రిప్లై ఇచ్చారు.
నిన్న జరిగిన భారత్-పాక్ మ్యాచ్ (IND vs PAK Match)లో టీమిండియా (TeamIndia) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ సమయంలో పాకిస్తాన్ క్రికెటర్లను టార్గెట్ చేస్తూ ప్రేక్షకులు జై శ్రీరాం (Jai Sriram) అంటూ నినదించారు. ఈ విషయంపై తమిళనాడు (Tamilnadu) మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) స్పందిస్తూ ఆగ్రహించారు. కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఇప్పుడు జై శ్రీరాం నినాదంపై ఆయన మరోసారి వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ (BJP) నేతలు ఫైర్ అవుతున్నారు.
ఉదయనిధి స్టాలిన్ పోస్ట్ చేసిన వీడియో:
India is renowned for its sportsmanship and hospitality. However, the treatment meted out to Pakistan players at Narendra Modi Stadium in Ahmedabad is unacceptable and a new low. Sports should be a unifying force between countries, fostering true brotherhood. Using it as a tool… pic.twitter.com/MJnPJsERyK
క్రీడాస్ఫూర్తికి, ఆతిథ్యానికి భారత్ పెట్టింది పేరని, అయితే అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం (Ahmedabad Narendramodi Stadium)లో పాకిస్తాన్ క్రికెటర్లపై ప్రేక్షకులు దిగరారి ప్రవర్తించారని మండిపడ్డారు. అది ఆమోదయోగ్యం కాదని, సోదర భావాన్ని పెంచి, దేశాలను ఏకం చేసే శక్తి క్రీడలకే ఉందని అన్నారు. ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు క్రీడలను (Sports) ఉపయోగించడం సరైన పద్దతి కాదని ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ (Stalin Tweet) చేశారు.
వన్డే వరల్డ్ కప్ (Odi World Cup) టోర్నీలో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, పాక్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఔట్ అయ్యి డ్రెసింగ్ రూమ్ వైపు వెళ్తున్న సమయంలో ప్రేక్షకులంతా జైశ్రీరాం జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో ఉదయనిధి స్టాలిన్ షేర్ చేస్తూ కామెంట్స్ చేయడం తమిళనాడు రాజకీయాల్లో కలకలం రేపింది.
ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తమిళనాడు చీఫ్ అన్నమలై (Annamalai) ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడలను ఓ ఆటగానే చూడాలని ఉదయనిధి స్టాలిన్ సందేశాలు ఇస్తున్నారని, అసలు ఆ విషయంతో ఆ మంత్రికి ఏ సంబంధం లేదని మండిపడ్డారు. ఆయన సనాతన ధర్మాన్ని మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారని బీజేపీ చీఫ్ అన్నమలై ప్రశ్నించారు.