»Tamilnadu Bjp Chief Annamalai Slams Cm Kcr Infront Of Kavitha
Video: కవిత ముందు కేసీఆర్ ప్యామిలీని ఏకీపారేసిన తమిళనాడు బీజేపీ చీఫ్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముందు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. సీఎం కేసీఆర్ ఫ్యామిలీని ఏకీపారేశారు. ఆ వీడియోను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ షేర్ చేశారు.
Tamilnadu BJP Chief Annamalai Slams CM KCR Infront Of Kavitha
Tamilnadu BJP Chief Annamalai: వచ్చే లోక్ సభ ఎన్నికల గురించి ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kavitha), తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై (Annamalai), కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (kaarthi) పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం, అభివృద్ధి అంశాలపై డిస్కషన్ జరిగింది. కవిత ముందు కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి, వారసత్వ రాజకీయాల గురించి అన్నామలై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అతను మాట్లాడినంత సేపు కవిత.. మీడియా వైపు ఆశ్చర్యంగా చూస్తూ కనిపించారు. ఆ వీడియోను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
చర్చలో అన్నామలై మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ల నుంచి సీఎం కేసీఆర్ ఏం చేశారని అన్నామలై ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఏంలా వాడుకున్నారని విమర్శించారు. లిక్కర్ ద్వారా సంపాదిస్తున్నారని ఆరోపించారు. మద్యంతో వచ్చిన ఆదాయంతో ఓట్లను కొంటున్నారని తెలిపారు. ఇది అభివృద్ధి మోడల్ అవుతుందా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణ నికర అప్పు రూ.75 వేల కోట్లు.. ఇప్పుడు అది రూ.3.13 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. దేశంలో అత్యధిక అప్పులతో తమిళనాడు ఉందని.. రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తోందని.. తండ్రి సీఎం, కొడుకు మంత్రి, కూతురు ఎమ్మెల్సీ, సడ్డకుని కుమారుడు ఎంపీ, మరో అల్లుడు మంత్రి, మహారాష్ట్ర పార్టీ ఇంచార్జీ అని విరుచుకుపడ్డారు. అతను మాట్లాడినంత సేపు కవిత అలా చూస్తూనే ఉండి పోయారు.
కేసీఆర్ కుటుంబాన్ని ఏకి పారేసిన తమిళనాడు బిజెపి అధ్యక్షుడు శ్రీ @annamalai_k గారు.
మద్యం పోయించి సంపాదిస్తున్నారు. అప్పులు తెచ్చి అభివృద్ధి అని చూపిస్తున్నారు. కుటుంబం అంతా పదవులు అనుభవిస్తున్నారు. కానీ బీజేపీలో సామాన్యుడికి అవకాశం ఇస్తారు. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నాది… pic.twitter.com/Pi8Cb4m3qD
బీజేపీ అలా కాదని, వారసత్వ రాజకీయాలు ఉండవని గుర్తుచేశారు. తమది దొరల కుటుంబం కాదని, రాజకీయ నేపథ్యం లేదని అన్నామలై పేర్కొన్నారు. తమది మిడిల్ క్లాస్ జీవితం అని.. తన తండ్రి సామాన్య రైతు అని వివరించారు. తండ్రి ఇంటర్ వరకు చదివాడని, తన తల్లి ఆరో తరగతి చదివిందని గుర్తుచేశారు. తాను తమిళనాడు బీజేపీ చీఫ్ పదవీ చేపట్టానని వివరించారు. ఇక్కడ సామాన్యులకు అవకాశం ఉంటుంది.. ఇది బీజేపీలోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ బలంగా లేదని, వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టకపోవచ్చని అంగీకరించారు. కానీ తమ పార్టీని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. అదీ వారసత్వ రాజకీయాల ద్వారా కాదని.. కార్యకర్తలతోనని స్పష్టంచేశారు.