Dharmapuri Arvind: కవిత లిక్కర్ బోర్డు తీసుకొచ్చిందంటూ విమర్శలు
కల్వకుంట్ల కవిత లిక్కర్ బోర్డు తీసుకొచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను మాత్రం పసుపు బోర్డు ఏర్పడేందుకు కృషి చేశానని వివరించారు.
Nizamabad MP Dharmapuri Arvind: తెలంగాణ గట్టు మీద రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) ఆర్మూర్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. అందుకే మరింత యాక్టివ్గా ఉంటున్నారు. ఈ రోజు జగిత్యాలలో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు.. ఎమ్మెల్సీ కవిత లక్ష్యంగా విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ నేతలు కబ్బాలతో కాలం వెళ్లదీస్తారని అర్వింద్ విరుచుకుపడడారు. లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తారని మండిపడ్డారు. నాలుగు పైసల అవినీతి తనమీద లేదని అంటున్నారు. దలారి వ్యవస్థను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. ఇటు కవితపై కూడా విమర్శలు చేశారు.
కల్వకుంట్ల కవిత లిక్కర్ బోర్డు తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. తాను మాత్రం పసుపు బోర్డు తీసుకొచ్చానని అర్వింద్ (Arvind) వివరించారు. ఇక్కడి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చానని పేర్కొన్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తానని స్పష్టంచేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో హుందాతనం రావాలని అర్వింద్ (Arvind) అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నేరవెరబోతుంది. దీంతో ఈ ప్రాంత రైతులు మరోసారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంటే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కవిత బరిలోకి దిగిన ఓటమి తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.