»Congress Has Complained To Cec Against Minister Ktr Comments
Congress: మంత్రి KTRపై సీఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రత్యర్థుల కామెంట్లకు ప్రధాన పార్టీలు దీటుగా స్పందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేశారు.
Congress has complained to CEC against Minister KTR comments
తెలంగాణ బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఓ సభలో భాగంగా కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్ కు వేయాలని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియామావళికి విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి(Venugopalaswamy) ప్రధాన ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోకుంటే తాము కోర్టుకు కూడా వెళతామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా..కాంగ్రెస్ పార్టీ మరికొన్ని రోజుల్లో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రాష్ట్రం వ్యాప్తంగా ఈనెల 15 నుంచి పర్యటించనున్నారు. దీంతోపాటు ఈనెల 15న బీజేపీ కూడా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులను ప్రచారంలోకి దింపాలని చూస్తుండగా..కాంగ్రెస్(congress) పార్టీ మళ్లీ రాహుల్ గాంధీని ఈ ఎన్నికల ప్రచారంలో భాగం చేయాలని చూస్తోంది.