»Attack On Person With Friends Case Registered Against Jubilee Hills Mla Pa
Jubilee Hills: ఫ్రెండ్స్‌తో కలిసి వ్యక్తిపై దాడి..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పీఏపై కేసు నమోదు
జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే పీఏపై అటెంప్డ్ మర్డర్ కేసు నమోదైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోలు, ఫోటోలు ద్వారా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (MLA Maganti Gopinadh) పీఏపై కేసు నమోదైంది. పీఏ మాధవ భాస్కర్ (Madhava Bhaskar) ఓ వ్యక్తిని చంపేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో కేసును సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు పీఏ భాస్కర్‌తో పాటుగాఆయన స్నేహితుడు లలిత్ కుమార్‌పై కూడా కేసును నమోదు చేశారు. ఓ వ్యక్తిని తన ఫ్రెండ్స్‌తో కలిసి విచక్షణా రహితంగా పీఏ మాధవ భాస్కర్ దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కలకలం రేపింది.
నెట్టింట వీడియో వైరల్ (Video Viral ) అవ్వడంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మాధవ భాస్కర్ దాడి చేసిన వ్యక్తిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అని పోలీసులు గుర్తించారు. బాధితుడు పేరు చందు అని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో యూసఫ్‌గూడలో ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు.
చందు ఓ మహిళతో ఉండగా అంత రాత్రి వేళ అక్కడేం చేస్తున్నావని లలిత్ వారిని ప్రశ్నించగా మాటామాటా పెరిగింది. ఈ తరుణంలోనే వారి ఇరువురిపై వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఉన్న చందు అక్కడే ఉన్న లలిత్ బైక్‌ను ఢీకొట్టాడు. అంతేకాకుండా చందు ఓ రాయిని తీసుకుని లలిత్ పైకి విసిరాడు. ఆ రాయి ఎమ్మెల్యే పీఏ భాస్కర్‌కు తలిగిందని, ఆ సమయంలో కోపోద్రిక్తుడైన భాస్కర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి చందుపై దాడిగి దిగినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇంత వరకూ స్పందించలేదు. ఘటన తర్వాత ఎమ్మెల్యేతో పీఏ భాస్కర్ సన్నిహితంగా ఉండే ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు వైరల్ అవుతోన్న వీడియోలు, ఫోటోల ఆధారంగా పలువురిని విచారిస్తున్నారు. ఎమ్మెల్యే పీఏ మాధవ భాస్కర్, ఆయన స్నేహితుడిపై అటెంప్ట్ మర్డర్ కేసు (Attempt Murder Case) నమోదు చేశారు.