రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Revanth Reddy Clarity on Selection of telangana congress MLA Tickets
తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల టిక్కెట్ల ఎంపిక విషయంలో చర్చ జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక జాబితాపై పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ప్రకటించడం లేదని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా అభ్యర్థుల ఎంపిక గురించి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక తుది ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామన్నారు. ఇలాంటి నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక వార్తలపై మీడియా సంయమనం పాటించాలని కోరారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సర్వేలు కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పినట్లు గుర్తు చేశారు. దీంతోపాటు పొత్తులపై కూడా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని రేవంత్ అన్నారు. మరోవైపు అధికార బీఆర్ఎస్(BRS) పార్టీకి పలువురు ఐఏఎస్ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు కాంగ్రెస్ గురించి తప్పుడు వార్తలు రాస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.