Congress First List: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చింది. ఫస్ట్ లిస్ట్ (first list) రేపు రిలీజ్ చేయనున్నారు. సామాజిక సమీకరణాలు, అనుభవం, విజయావకాశాలు తదితర అంశాలను ప్రామాణికంగా చేసుకొని టికెట్లను కేటాయించారు. ఫస్ట్ లిస్ట్‌లో సీనియర్లకు, ప్రముఖ నేతలు.. గెలుపు గుర్రాలకే టికెట్ కేటాయించినట్టు విశ్వసనీయ సమాచారం.
అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ మూడుసార్లు భేటీ అయ్యింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఏఐసీసీ ఆమోదం తర్వాత ప్రకటన విడుదల చేయనుంది. 58 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామని స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరప్ తెలిపారు. మిగిలిన స్థానాలకు త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తామని వివరించారు.
కమ్యునిస్టులతో పొత్తుల చివరి దశకు చేరుకున్నాయని మురళిధరన్ తెలిపారు. ఆ పొత్తులపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్కఠ నెలకొంది. లిస్ట్‌లో తమ పేరు ఉంటుందా..? లేదా అనే సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ జాబితాపై ఆశావాహులు బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నారు.