మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiya) రాజీనామా పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన ఆయన ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. ప్రజల్లో ఉండి సేవ చేస్తే ఎందుకు గెలవరని రేవంత్ రెడ్డి(Revanth Reddy)ప్రశ్నించారు. పొన్నాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి కూడా 40 వేల ఓట్లతో ఓసారి, 50 వేల ఓట్లతో ఇంకోసారి ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారే చేయలేదని పేర్కొన్నారు. జనగామ టికెట్ (Janagama Ticket) కోసం ముగ్గురిని ఎంపిక చేస్తే అందులో పొన్నాల కూడా ఉన్నారని ఆయన తెలిపారు.
అభ్యర్థులు ఇంకా ఫైనల్ కాకుండానే రాజీనామా (Resignation) చేయడం వెనకున్న కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే పార్టీని దెబ్బతీయడానికి, బలహీన పర్చడానికే ఆయన రాజీనామా చేసినట్టు ఉందని ఆరోపించారు. కార్యకర్తలకే బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజీనామాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అన్నం తినేవాళ్లు ఎవరైనా రేవంత్ పైసలు తీసుకున్నాడని అంటారా? అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ ఒక్కడే టికెట్లు ఇవ్వడని, అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేసి టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు.
కాగా, రాష్ట్రంలో విడతల వారీగా రాహుల్‌గాంధీ(Rahul Gandhi), ప్రియాంకగాంధీ బస్సు యాత్ర ఉంటుందని రేవంత్ తెలిపారు. పొన్నాల లక్ష్మయ్య ఒక ఔట్‌డేటెడ్ పొలిటీషియన్ మాత్రమే కాక జనగామ జిల్లాలో, నియోజకవర్గంలో ఆయన వెంట లీడర్, కేడర్ లేదని బీఆర్ఎస్ (BRS) భావిస్తున్నాది. ఎలాంటి సపోర్టు లేని ఆయన్ను చేర్చుకోవడం ద్వారా వచ్చే మైలేజ్ కూడా లేదనేది వారి భావన. ఆయన పట్ల నియోజకవర్గ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని, ఆయనను చేర్చుకుంటే ఆ నెగెటివ్ (negative) మొత్తం పార్టీకి అంటుకుంటుందని పేర్కొన్నారు.