ప్రముఖ నటి తాప్సీ పన్ను నిర్మించిన తాజా హిందీ చిత్రం 'ధక్ ధక్(dhak dhak)' నేడు(అక్టోబర్ 13న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నలుగురు మహిళా బైకర్ల చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తాప్సీ కీలక వ్యాఖ్యలు చేసింది.
Taapsee pannu shocking comments on Bollywood industry dhak dhak
స్టార్ హీరోయిన్ తాప్సీ నిర్మాతగా వ్యవహరించిన తాజా చిత్రం ‘ధక్ ధక్(dhak dhak)’ ఈరోజు(అక్టోబర్ 13న) విడుదలైంది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ(Taapsee pannu) బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే కంటెంట్ ఈజ్ కింగ్ అనే అంశంపై తాప్సీ తన అభిప్రాయాలను పంచుకుంది. చాలా మంది వన్-లైన్ కథను మాత్రమే విని సినిమాలకు ఓకే చెప్తారని తెలిపింది. అంతేకాదు తాను ఓ సినిమాకి సంతకం చేసినప్పుడు తన సహనటుడు ఎవరో ఎంత పెద్దవారు అని ఎప్పుడూ అడగలేదని చెప్పింది. ఆ క్రమంలో తాను చాలా మంది కొత్త దర్శకులు, అనేక నటులతో పనిచేశానని తెలిపింది.
అయితే OTT ప్లాట్‌ఫారమ్‌లు పెరిగినా కూడా “స్టార్ సిస్టమ్” బాలీవుడ్‌ను ఆధిపత్యం చేస్తూనే ఉందని తాప్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. నటీనటులు, స్టూడియోలు ప్రేక్షకులతో సహా ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతికి దోహదం చేస్తారని ఆమె ఎత్తి చూపారు. చిన్న చిత్రాల డిజిటల్ హక్కుల(digiral rights) ద్వారా తమ పెట్టుబడులను తిరిగి పొందేందుకు స్టూడియోలు సరిగ్గా ప్యాకేజ్ ఇవ్వడం లేదన్నారు. ఇది స్థిరపడిన తారలకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది.
చిన్న చిత్రాల శాటిలైట్ హక్కులను విక్రయించడం సహా విడుదల చేయడంపై ఆయా సంస్థలు ఆసక్తి చూపడం లేదని తాప్సీ తెలిపింది. పరిశ్రమ ఎదుగుదలకు ఇది చాలా ముఖ్యమని నటి పేర్కొంది. ప్రజలు పెద్ద స్టార్లను ఆదరిస్తూ ఉంటే ఇలాంటి చిన్న చిత్రాల నటీనటులు, తారల మధ్య అంతరం పెరుగుతూనే ఉంటుందని చెప్పింది. అంతేకాదు బాలీవుడ్ కొత్తగా ఏమి ప్రయత్నించడం లేదని పేర్కొంది. కానీ తాము కొత్తగా చేయడానికి ప్రయత్నించినప్పుడు, చాలా తక్కువగా సపోర్ట్(support) లభిస్తుందని పేర్కొంది. ఈ విధానం తప్పనిసరిగా మారాలని తాప్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. విభిన్నంగా చేయాలని ప్రయత్నించేవారికి పరిశ్రమలోని వ్యక్తులు మద్దతు ఇవ్వరని నటి ఆవేదన వ్యక్తం చేసింది.