బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన డుంకీ మూవీ విడుదల తేదీ వాయిదా పడుతుందన్న వార్తలపై మేకర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. డుంకీ మూవీ రిలీజ్ తేదీ వాయిదా పడదన్నారు. అయితే ప్రభాస్ సాలార్ మూవీ కూడా డిసెంబర్ 22న ఉండటంతో ఈ పుకార్లు వచ్చాయి.
Rajkumar Hirani Clarity on Shahrukh khan Dunki movie release date Postponement
గత కొన్ని రోజులుగా షారుఖ్ ఖాన్(Shahrukh khan) యాక్ట్ చేసిన ‘డుంకీ(Dunki)’ మూవీ విడుదల తేదీ వాయిదా పడుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే డుంకీ మూవీ విడుదల కానున్న డిసెంబర్ 22న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్ పార్ట్-1 కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ డుంకీ మూవీ పోస్ట్ పోన్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అంతేకాదు మరికొంత మంది డుంకీ మూవీ పొస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం కారణంగా మూవీ తేదీ వాయిదా పడిందని ప్రచారం చేశారు. కానీ తాజాగా వీటిపై డుంకీ మూవీ డైరెక్టర్ రాజ్కుమార్హిరాణి(Rajkumar Hirani) స్పందించారు. Dunki రిలీజ్ డేట్ వాయిదా పడిందనే వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్లో పెద్ద స్టార్ హీరోల చిత్రాలు ఒకేసారి రిలీజ్ కానున్న నేపథ్యంలో ఫాన్స్ మధ్య అతిపెద్ద పోటీ నెలకొననుంది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా షారూఖ్ ఖాన్ నటించిన ‘డుంకీ’, ప్రభాస్ ‘సాలార్’ రెండు కూడా ఒకేసారి థియేటర్లలో విడుదల కానున్నాయి. ‘డంకీ’ వాయిదా పడవచ్చని అనుకున్నారు. కానీ సినిమా విడుదల వాయిదా పడదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరి ‘సాలార్’ పార్ట్ 1 విడుదల చేస్తారా లేదా మళ్లీ పోస్ట్ పోన్ చేస్తారా అనేది చూడాలి. ఇప్పటికే సాలార్(salaar) చిత్రం విడుదల తేదీని ఓసారి వాయిదా వేశారు.
డుంకీ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కింగ్ ఖాన్‌తో పాటు తాప్సీ పన్ను, దియా మీర్జా, బోమన్ ఇరానీ, ధర్మేంద్ర సహా పలువురు నటీనటులు యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సి.కె.మురళీధరన్ అందించగా, సంగీతం ప్రీతమ్ సమకుర్చారు. ఇక ప్రభాస్(prabhas) నటించిన సాలార్ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా..హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.