Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు గారాల పట్టి సితార (Sitara). సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. డ్యాన్స్ చేసిన వీడియోలను అప్ లోడ్ చేస్తుంటారు. సినిమాలు అంటే ఇష్టం అని ఇదివరకు ప్రకటించారు. ఇటీవల ఓ జ్యువెల్లరీకి సంబంధించిన యాడ్ కూడా చేశారు. దాదాపు రూ.2 కోట్ల వరకు తీసుకున్నారు. కానీ ఆ డబ్బును.. సేవా కార్యక్రమాల కోసం కేటాయించారు.
నేషనల్ సినిమా డే ఈ రోజు.. ఈ క్రమంలో సితార ఇన్ స్టలో ఓ పోస్ట్ చేశారు. సినిమా అంటే తన దృష్టిలో పరిశ్రమ కాదని.. తన డీఎన్ఏలోనే మూవీ ఉందన్నారు. తన జీవితంలో సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెబుతున్నారు. లెజండరీ సూపర్ స్టార్ కృష్ణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేశారని పేర్కొన్నారు. తాత వారసత్వంలో భాగమైనందుకు గర్వపడుతున్నా అని తెలిపారు.
తన తండ్రి నాన్న ఎలా స్ఫూర్తి పొందారో.. తాను కూడా నాన్న నుంచి ప్రేరణ పొందాను అని సితార పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నటి కావాలని ఉందని.. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని మరోసారి చెప్పారు.