»Why Telangana People Celebrate The Bathukamma Whta Is The Bathukamma History
Bathukamma 2023: బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?
ఆశ్వయుజ శుద్ధ అమవాస్య రానే వచ్చింది. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఎన్నో ఏళ్లు నుంచి జరుపుకుంటున్నా ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది. ఎందుకు దీనిని జరుపుకుంటారో వివరాలు తెలుసుకుందాం.
Bathukamma 2023: బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అంటూ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి చేసుకునే బతుకమ్మ పండుగ ఈరోజు నుంచి మొదలువుతోంది. ఆశ్వయుజశుద్ధ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ పండుగను 9రోజులు పాటు ఘనంగా ఆట, పాటలతో జరుపుకుంటారు. తంగేడు, చామంతి, బంతి, అడవి గడ్డి, మందారం, రామబాణం, గుణుగు, గుమ్మడి వంటి ఎన్నో రకరకాల పూలను ఉపయోగించి బతకమ్మను తయారు చేస్తారు. తొలిరోజు ఎంగిలి పూలతో బతుకమ్మను ప్రారంభించి చివరిగా సద్దులపూల బతుకమ్మ రోజు నిమజ్జనం చేస్తారు. ఇంత వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగ చరిత్ర ఏంటి? అసలు బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చిందో? తెలుసుకుందాం.
పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోళ పరిపాలించాడు. వీరి వద్ద వేములవాడ చాళుక్యులు సామంతులుగా ఉండేవారు. చోళరాజులు వేములవాడలో ఉన్న శ్రీ రాజ రాజేశ్వరి స్వామిని విశ్వసించేవారు. రాజరాజ చోళ తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు కళ్యాణి చాళుక్య రాజైన సత్యాశ్రయుడిని యుద్ధంలో ఓడించి వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేశాడు. ఇందులో ఉన్న భారీ శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి బహుమతిగా ఇవ్వగా.. దానిని బృహదీశ్వరాలయంలో ప్రతిష్టించాడని తమిళ శాసనాల్లో చూడవచ్చు. వేములవాడలో పార్వతిసమేతుడై ఉన్న శివలింగాన్ని వేరుచేసి.. బృహదీశ్వరాలయంలో ప్రతిష్టంచడం తెలంగాణ ప్రజలను బాధ కలిగిస్తుంది. బృహదమ్మ(పార్వతి) నుంచి శివుని లింగాన్ని వేరు చేశారని వాళ్ల బాధను చోళ రాజులకు తెలియజేస్తారు. అప్పుడు పర్వతంలా పసుపు రంగు పూలతో గౌరమ్మను అమర్చి తొమ్మిది రోజులు పాటు బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం ప్రారంభించారు. బృహదమ్మ పేరు నుంచి బతుకమ్మను తీసుకుని ఏటా 9రోజుల పాటు ఘనంగా తెలంగాణ ప్రజలు ఈ పండుగను జరుపుకుంటున్నారు.
బతుకమ్మకు తొమ్మిది రోజుల పాటు ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తారు. మొదటి ఎనిమిది రోజుల నైవేద్యాన్ని ఎవరైనా చేస్తారు. కానీ చివరిరోజు సద్దుల బతుకమ్మ రోజు మహిళలు మాత్రమే నైవేద్యాన్ని తయారు చేస్తారు.
ఎంగిలి పూల బతుకమ్మ:మహా అమావాస్య రోజుతో బతుకమ్మ వేడుక మొదలవుతుంది. దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి బతుకమ్మకు నైవేద్యంగా పెడతారు.
అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.