తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని తిరిగి గెలిపిస్తే చేసే పనులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధాన హామీలను ఓ సారి పరిశీలిద్దాం.
BRS Manifesto Highlights: అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మరోసారి అధికారం ఇస్తే చేసే పనులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాకు వివరించారు. గత పథకాలను కొనసాగిస్తూనే.. కొత్తగా మరిన్నింటినీ ప్రకటించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో హైలైట్స్ ఒకసారి చుద్దాం.
కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా: రాష్ట్రంలో ఉన్న 93 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే రూ.5 లక్షలకు బీమా చేస్తోంది. సహజ మరణం అయినా సరే రూ.5 లక్షలను ఇవ్వనుందని కీలక ప్రకటన చేశారు.
అన్నపూర్ణ పథకం: రేషన్ కార్డ్ హోల్డర్‌కు సన్న బియ్యం ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు. అందరూ సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెడతున్నామని చెప్పారు. ఈ పథకానికి అన్నపూర్ణ పేరు పెట్టారు.
కల్యాణలక్ష్మీ పథకం:కల్యాణలక్ష్మీ పథకం అమలు. తొలుత రూ.50 వేలు నుంచి అమలు చేశామని గుర్తుచేశారు. తర్వాత రూ.75 వేలు, రూ.1 లక్షకు పెంచామని వివరణ, ఇప్పుడు దానిని రూ.1.25 లక్షలకు పెంపు
పెన్షన్:రూ. వెయ్యి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. ఇప్పుడు రూ.2016 ఉంది. పెన్షన్ దశలవారీగా రూ. 5 వేలు పెంపు. వచ్చే మార్చి తర్వాత రూ.3 వేలు. ఏడాది రూ.500 పెంచుతామని ప్రకటన. చివరి వరకు రూ.5 వేలు అవుతుంది.
దివ్యాంగుల పెన్షన్: దివ్యాంగుల పెన్షన్ రూ.4 వేలు ఉంది. దానిని రూ.6 వేల చేస్తాం అన్నారు. మార్చి తర్వాత రూ.5 వేలు ఇస్తాం. ఏడాదికి రూ.300 వేలు చేస్తూ.. చివరికి 6 వేలు చేస్తామని ప్రకటన. రాష్ట్రంలో 5.35 లక్షల కుటుంబాలు ఉన్నాయని ప్రకటన
రైతు బంధు పథకం:రైతుబంధు ద్వారా ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నాం. దానిని రూ.16 వేలకు పెంపు. ఫస్ట్ ఇయర్ రూ.12 వేలు.. చివరి వరకు రూ.16 వేలు పడతాయి.
సౌభాగ్యలక్ష్మీ:అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు ఇస్తాం అని ప్రకటన. బీపీఎల్ ఫ్యామిలీకి మాత్రమే అందచేస్తామని స్పష్టీకరణ
లబ్ధిదారులు: అర్హులకు రూ.400కే గ్యాస్ సిలిండర్, అక్రిడెటేడ్ జర్నలిస్టులు అందరికీ రూ.400 సిలిండర్ ఇస్తామని ప్రకటన
కేసీఆర్ ఆరోగ్య రక్ష: 2014లో రూ.2 లక్షలు వరకు ఉండేది. రూ.5 లక్షలు పెంపు. తర్వాత రూ.10 లక్షలు చేశాం. గరిష్టంగా రూ.15 లక్షలకు పెంచుతామని ప్రకటన. ప్రజలతోపాటు జర్నలిస్టులకు రూ.15 లక్షలకు ట్రీట్ మెంట్ ఇస్తాం.
సమగ్ర కుటుంబ సర్వే: 11 లక్షల మందికి ఇళ్లు లేవు. ఇళ్ల కోసం డబుల్ బెడ్ రూమ్, గృహలక్ష్మీ పథకం అమలు చేశాం. నియోజకవర్గానికి 3 వేల చొప్పున గృహలక్ష్మీ ఇళ్లు ఇస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌లో మరో లక్ష ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటన, గృహలక్ష్మీ స్కీమ్, ఇళ్ల స్థలం కూడా ఇస్తామని స్పష్టీకరణ
స్వశక్తి మహిళా గ్రూపులు:46 లక్షల మంది మహిళలు గ్రూపుల్లో ఉన్నారు. పావలా వడ్డీకి రుణం తీసుకొని 99.9 శాతం లోన్ రీ పేమెంట్ చేశారు. వారిలో కొందరికీ సొంత భవనాలు ఉన్నాయి. లేనివారికి కట్టిస్తామని హామీ
అనాథల కోసం పాలసీ: అనాథల కోసం ఆర్పన్ పాలసీ తీసుకొస్తాం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి
అసైన్డ్ ల్యాండ్:భూమికి హక్కుదారు పత్రం ఇస్తాం. అసైన్డ్ భూముల అంశంపై అన్నీ పార్టీ ఎమ్మెల్యేలు కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఆంక్షలు ఎత్తివేసి, హక్కులు కల్పిస్తామని వెల్లడి.
ప్రభుత్వ ఉద్యోగులు:ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు కోసం కమిటీ నియామకం. ఉద్యోగుల జీవన భద్రత.. సాధ్యా సాధ్యాలపై కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ.